Pandem Kodi Kokkuruko
LYRICS : RL REDDY
SINGERS : ROUNAK GATTU,ARNAV GATTU and MANASWINI
RAP : SANTOSH REDDY ILENI
PROGRAMMING : VIJAY REDDY ILENI
RHYTHMS : GANESH
VIDEO : SANTOSH REDDY ILENI, LOKESH REDDY AND RAJU
FLUTE : YUGANDAR GATTU
CAST : ROUNAK GATTU,ARNAV GATTU, SAKETH REDDY ,GAJANAND GARU
PRODUCERS : RY MUSIC AND MOVIES
SPECIAL THANKS TO : SWAPNA PATEL AND PRASANNA REDDY
పందెం కోడి కొక్కరకో
పల్లెసీమ పదనిసలు
వచ్చెను పల్లెకు సంక్రాంతి
పచ్చని వెచ్చని కబురులతో
రా రా రమ్మని పిలిచే
రా రా రమ్మని పిలిచే
రథము ముగ్గుఎక్కి
గొబ్బెమ్మ పండుక్కి
భగ భగ భోగి మంటలు
చేదు గతాన్ని మరవ మన్నది
ఘుమ ఘుమ పిండి వంటలు
ఒంటికి సత్తువ ఇవ్వమన్నది
హరిదాసుల భజన కీర్తనలు
స్మరణ చేయవో హరినన్నది
గంగిరెద్దుల విన్యాసాలు
పాడిపంటలు విడవకన్నది
మకరరాశిలో సూర్యుడు చేరగ
మెల్లగా పల్లె తెల్లారింది
పట్టణాలన్నీ పల్లెను చేరి
పంచుకున్నవి సంతోషాలు
పందెం గెలిచె పతంగి
నా మరదలు కొంటె కోనాంగి
తొడిగిన పూల కొత్తంగి
మా నవ్వులు చేరాలి ఆ నింగి