Vendi Mabbullo Ni Prema Naku
SINGER : DIVYA MALIKA
LYRICS AND MUSIC : RL REDDY
FLUTE : YUGANDHAR GATTU
KEY BOARD : VIJAY REDDY ILENI
GUITAR : SUNNY
RHYTHMS : ANIL
CHORUS : HARSHITHA AND JAYASRI
SOUND ENGINEERS : SURESH,VENKAT
D.O.P : HARISH PATEL
EDITED AND DI : AJAY RANGU
CAST : MOWNIKA BINAL
వెండి మబ్బుల్లో నీ ప్రేమ నాకు
మంచు తుఫాన్ లెక్క ఉంటాది
పండిన సెలకల్లో పిండార బోసిన
వెన్నల లెక్క బాగుంటాది
మత్తడి దూకేటి చెరువును చూసిన
రైతు పానమోలే మస్త్ ఉంటాది
మెత్తని మనుసుకు కొత్తగా ఆశలు
ఇగురుపెట్టినట్టు అనిపిస్తాది
ఎపుడెపుడు వస్తావో బావ ఏలుపట్టి ఏలుతావో
నా కాలిమట్టెల సప్పుడు వింటు కాలమెల్ల దీస్తావో
చరణం 1:
బుల్లెట్టు బండెక్కి తెల్లారేకల్లా
ఊరంతా తిరుగుతుంటాడే
వేపపుల్లతో పళ్ళుతోముకుంటూ
గోడ సందుల కెల్లి చూస్తాడే
జాతరలో దొరికేటి కళ్ళద్దాలను
కాయిసుపడి పెట్టుకుంటాడే
చిల్లరవేశాలు ఎన్ని వేశిన గాని
చిట్టి గుండెకు వాడు నచ్చాడే
ఎపుడెపుడు వస్తావో బావ ఏలుపట్టి ఏలుతావో
నా కాలిమట్టెల సప్పుడు వింటు కాలమెల్ల దీస్తావో
చర్వణం 2:
గోరంత గూసులాటకు ఊరంతా వాడు
నన్ను బద్నాము చెయ్యాడే
తమలపాకు నములుతూ వాడు
నొయ్యకుండా మాటలంటాడే
అయ్యా అవ్వా చెప్పిన మాట వింటాడు
అందాల రాముడు నా ఓడే
అందర్నీ తనవారే అంటాడు
అక్కరకు సాయంగా ఉంటాడే
ఎపుడెపుడు వస్తావో బావ ఏలుపట్టి ఏలుతావో
నా కాలిమట్టెల సప్పుడు వింటు కాలమెల్ల దీస్తావో
Your passion for your subject matter shines through in every post. It’s clear that you genuinely care about sharing knowledge and making a positive impact on your readers. Kudos to you!